నువ్వొచ్చావని..
నువ్వొచ్చావని..


ప౹౹
నువ్వొచ్చావని నువ్వొచ్చావని మనసే తెలిపింది
మనసిచ్చావని మనసిచ్చావని సొగసే కలిపింది ౹2౹
చ౹౹
ఆరుబయట వేచి ఎదురుచూపులతో ఉన్న నాకే
ఊరుబయట చూసి ఆ ఊసూ మోసు కొచ్చినాకే ౹2౹
తేరపార చూసాక తెగువతో తెమ్మెర గోల చేసాక
తెరవెనుక మానసం తెరుచుకొని పూవై విరిసాక
౹ప౹
చ౹౹
అల తీరం చేరి కానరాక మరి అదృశ్యమైనటులే
కల ఊహలు కలసిపోయి కలవరం పెంచినటులే ౹2౹
ముదిరిన ముచ్చటలన్నీ ముద్దుచేసి మురిపించ
చెదిరిన జ్ఞాపకాలను చేరదీసీ ఆశలన్నీ కలిపించ
ప౹
చ౹౹
ఏనాటి బంధమో విడిపోని సంబంధమే కలపవా
నానాటి అందమే నాజూకై సన్నద్దము తెలుపగా ౹2౹
కురిసిన భావాలే కులుకులై మనసున పూయగ
చేరవేసిన చెలిమి పలుకులై కోయిలగా కూయగ ౹ప౹