నువ్వే నేను
నువ్వే నేను
ఎటు చూసినా ... నువ్వే కనిపిస్తావు
ఏది విన్నా...నీ గుసగుసలే వినిపిస్తాయి!!
కళ్ళు మూసుకుంటే... కనురెప్పగా వాలిపోతావు
కళ్ళు తెరిస్తే ....కనుపాపగ మారిపోతావు!!
ఆవేశంగా ఉంటే....శాంతిదూతగా వస్తావు
ఆనందంగా ఉంటే...అందంగా దరిచేరుతావు!!
విచారంగా ఉంటే... ఆలపనగా జతవుతావు
వినోదంగా ఉంటే....హద్దులు గుర్తుచేస్తావు!!
తెలివైనదానివి అంటూనే ...వెంటనే
తెలివితక్కువదానిని అని విమర్శ చేస్తావు!!
నన్ను నాకు ఎప్పుడూ కొత్తగా పరిచయం చేస్తూ
బలహీనంగా ఉండే బంధాలకు విలువ ఇవ్వద్దు
అంటూ బలంగా తయారు చేస్తావు!!
నా అంతరాత్మగా నాలోనే ఉంటూ
ప్రతి క్షణం నాతోడై నన్ను నడిపిస్తుంటావు!!
✍️by Radha

