నురుగు పొంగుల జీలుగులు...
నురుగు పొంగుల జీలుగులు...
ఏకాంతం
చడిచప్పుడులేని సాగర ప్రవాహం..
నిశ్శబ్దం
అచ్చున అలలాల సంగీతం..
అప్పుడప్పుడు అలరిస్తున్న
కెరటాలు కేరింతలు సంగమం
ఆ ఒడ్డునే ఊరులుగా
నూరుగు పొంగుల జీలుగుల్లు..
ఒంటరి వెన్నెల రాత్రుళ్లు
నా చెలీ చెక్కిలి జారిన
నురుగు సెగల మెరుపులు..
అల్లరి మేఘాలు జిమ్మికులు ఆపై
వాన తుంపరలు ...
తొందర చేస్తున్న చెలీ వలపు విందులు
తంపరం పుట్టిస్తున్న తేనే నగవులు..
ఊహలకి హద్దేలేని
ఊసులుతో మోస్తున్న ఆంక్షలు
కొరతకు కోతైన అక్షరాలు

