STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

నులి వెచ్చని..

నులి వెచ్చని..

1 min
273

నులి వెచ్చని కౌగిలితో చలి పులిని చంపేద్దాం

తొలి ముచ్చట తీరాకా తోరణాలూ నింపేద్దాం

ఎదలోని వెనుకటి ప్రమాణాలూ కలిసే చేద్దాం

మదీలోని మరపు లేని గుర్తులనెన్నో చేసేద్దాం

నులి వెచ్చని కౌగిలితో చలి పులిని చంపేద్దాం

తొలి ముచ్చట తీరాకా తోరణాలూ నింపేద్దాం

వేకువ చలిలో చూపుల నెగడూ వెలిగించావు

కువకువ కూనిరాగం కుందనమై పలికించావు

అరవిరిసిన అందాలూ హర్షితాలై పల్లవించగా

మొరఆలకించి మోక్షమిచట తనే ప్రభవించగా

శోభలన్నీ చేరికోరి చెలియతో చెలిమి చేయగా

ప్రాభవాలెన్నో పరవశంలో ప్రకరణాలే రాయగా

నులి వెచ్చని కౌగిలితో చలి పులిని చంపేద్దాం

తొలి ముచ్చట తీరాకా తోరణాలూ నింపేద్దాం

పలుకులన్నీ పాటలై పంచదార పలుకులాయే

కులుకులన్నీ పాఠాలై చందనాల తళుకులాయే

ఓరిమితో వయ్యారాలు వగలు నగలై హాసించే

కూరిమితోసయ్యాటలే కుదురుగ పరిహసించే

ఎన్నాళ్ళో వేచినా హృదయం ఇక ఉద్యమించ

నులి వెచ్చని కౌగిలితో చలి పులిని చంపేద్దాం

తొలి ముచ్చట తీరాకా తోరణాలూ నింపేద్దాం

ఎదలోని వెనుకటి ప్రమాణాలూ కలిసే చేద్దాం

మదీలోని మరపు లేని గుర్తులనెన్నో చేసేద్దాం

Rate this content
Log in

Similar telugu poem from Romance