నరకమేది
నరకమేది
మది కాల్చే ఈ ఒంటరి పాటకన్న నరకమేది..!?
శిలలపొదగ మిగులు మనసు వాడకన్న నరకమేది..!?
చిరునవ్వుల వనమేదో నీతోనే ఉంది కదా..!
ఆవేదన వరదలైన బాటకన్న నరకమేది..!?
నన్ను చూసి గరిక కూడ నవ్వసాగె చిత్రముగా..
నీ నీడయె తోడులేని తోటకన్న నరకమేది..!?
వెక్కిరించు కంటిచుక్క నీరసించె జారలేక..!
విరహవీణ కురియు అగ్గి వానకన్న నరకమేది..!?
వేణువింటి నాదసుధా మాధురిగా మారుటెలా..!?
తెలుపలేని పలుకుతేనె మూటకన్న నరకమేది..!?

