నన్ను నీ కోసం
నన్ను నీ కోసం
ఉషోదయంలో వికసించే పువ్వు
అడుగుతుంది....??
నన్ను నీకోసం....!!
నాకన్నా తాజాగా ఎలా నీ సోయుగాన్ని
నీలో దాచుకున్నావు అని...??
కురిసే మంచు ముత్యపు చినుకు
అడుగుతుంది...??
నన్ను నీకోసం...!!
నా కన్నా నువ్వు ఎంత బాగా నీ నవ్వు
ముత్యాలు ఎలా కురిపిస్తున్నావు అని...??
పువ్వులో ఉండే మధుర మకరందం
అడుగుతుంది....!!
నన్ను నీకోసం...
నీ సొగసు పరిమళ తేనె ఎలా మధురంగా
ఉరిస్తున్నావు అని...??
ఏమని చెప్పాలి...వాటికి..
నీకోసం...??
నీలో ఉండే ఇంతటి తాజా
అందాన్ని చూసి ఈర్స్య పడే వాటికి...!!

