STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

నన్ను క్షమించు

నన్ను క్షమించు

1 min
4



మంత్రమో!... మాయాజాలమో!
మాట మాత్రం పెదవుల సరిహద్దును దాటలేకపోయింది  
ఇకపై ఇదే మన చివరి కలయిక!
ఈ రోజైనా మనసు తోటలో భావాలు 
మాటలుగా వికసించకపోయే!
 
నిత్యం స్మరించే నీ కీర్తనలోని పంక్తులలో...
కొన్ని పదాలైనా ఏరి హారంగా మార్చి  
నీ హృదయానికి అలంకరించి ఉంటే 
బాగుండేది
తుది రోజైనా మౌన గవాక్షాన్ని తెరవగలిగింటే మదిలో ముస్తాబు చేసిన 'ప్రేమ' కనిపించేది! 
 
మస్తిష్కంలో గుత్తులు గుత్తులుగా 
వికసిత పుష్పాల్లా జ్ఞాపకాలు!
ఇప్పుడు వాటితో మాల అల్లి ఏం లాభం? 
శుష్క హృదయంతో 
శూన్య పటానికి అలంకరించడం తప్ప!
 
నువ్వో 'అదరు' పూవువి... 
నేనో 'బెదరు' తుమ్మెదను!   
ప్రేమనే పారిజాత మధువు ఎలా పుట్టేను?
ప్రేమ తపస్సు ఎంత చేసినా వరమడిగే వేళ... 
నోరు పెగలకుంటే... జీవితం ఇంతేనేమో! 
 
చివరి వీడ్కోలును నువ్వు 
కనులతో చెప్పేసి వెనుతిరిగిన వేళ... 
నీ వదనంలో మారిన రంగుల్ని 
ఎలా చూడగలను? 
మదిలో భావాలెలా చదవగలను?
 
నా పిరికితనంతో నీ హృదయం పీలికలయిందో...
అసంతృప్తితో అశనిపాతాన్ని  
ఇముడ్చుకున్న ధరణిలా రోదించిందో!
ఎక్కడున్నావో ప్రియతమా...నన్ను క్షమించు.


Rate this content
Log in

Similar telugu poem from Classics