STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

మనిషికి అర్థం నేడు మారిపోయరా

మనిషికి అర్థం నేడు మారిపోయరా

1 min
4



మనిషికి అర్థం నేడు మారిపోయెరా...
మనిషి అను వాడు ఎవరికీ దొరకడాయెరా...
మనీ మనుషుల చుట్టూ తిరుగసాగెరా...
నేడు మనసు వదిలేసి మరమనిషాయెరా...
మనసు వదిలేసి మరమనిషాయెరా... 

అన్నదమ్ముల మధ్య ఆత్మీయత అడుగంటే...
అక్కాచెల్లెళ్ళు ఆస్తి లెక్కలేయబట్టే...
ఇంటి పెద్దకిచ్చే విలువ మంటగలిసి పాయెనేడు...
బంధాలు ప్రేమలు బేరసారాలయ్యే...

ఇరుకైన ఇండ్లలో ఇంపుగా ఉండేటోళ్ళు...
కష్ట సుఖాలేమో కలిసి పంచుకుంటుండే...
బాధొచ్చినా భయపడని భరోసా ఉండేనాడు...
నేనున్నానని నెమ్మదిచ్చే మనిషప్పటివాడు...
నేడు మనసు వదిలేసి మరమనిషాయెరా...

తల్లిదండ్రుల ప్రేమను తక్కువ చేయబట్టిరి...
పెంచిన రుణమేమిటో పేరుకైనా ఎరుక లేదు...
స్వార్థమే సర్వమని సాగిపోబట్టిరి...
కలిసి మెలిసి బతికే కాలమే లేనిదింకా.

పల్లె గడప దాటగానే పట్టణమే స్వర్గమాయె...
పుట్టిన ఊరి మట్టిని మరచిపోయే ఎన్నడో...
ఆడి పాడిన మాయ లోకం వదిలేసి...
ఈ బతుకుల్లో బిజీగా తానైపోయి...
మరమనిషిలాగా బతుకెళ్ళదీస్తున్నాడు...
మరమనిషిలాగా బతుకెళ్ళదీస్తున్నాడు...;!!


Rate this content
Log in

Similar telugu poem from Classics