STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

నిషేధం ఏమిలేదు

నిషేధం ఏమిలేదు

1 min
358

నిషేధం ఏమిలేదు నిభాయించి వలపించను

విషాదం కాకూడదూ వివరించి గెలిపించను

తడారిన కనులకు తెలుసూ ఆ కథ అంతం

ఎడారిన ఎండమావిని చేయకే ఎద సాంతం

నిషేధం ఏమిలేదు నిభాయించి వలపించను

విషాదం కాకూడదూ వివరించి గెలిపించను


జీవించి ఉన్నంతవరకు బంధాలు తప్పవులే

చూపించి అవి చూచాయగానైనా చెప్పవులే

మోహించాక మొహమాటమేలా వివరించనే

ఊహించాక ఉరడించదా మది కలవరించనే

నిషేధం ఏమిలేదు నిభాయించి వలపించను

విషాదం కాకూడదూ వివరించి గెలిపించను


గట్టుచేరని ప్రేమలు గరళంతో అంతమయేనే

గుట్టుచాటుగా ఎన్నో కథలే ముగిసి పోయెనే

కథ కంచికి చేరకా కల్యాళమై కలిసిపోవాలిలే

పొదరిళ్ళ పొత్తిళ్ళలో పొంతనుండి పోవాలిలే

నిషేధం ఏమిలేదుగ నిభాయించి వలపించనే

విషాదం కాకూడదుగా వివరించి గెలిపించనే

తడారిన కనులకూ తెలుసూ ఆ కథ అంతం

ఎడారిన ఎండమావిని చేయకు ఎద సాంతం



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance