నిన్నే ప్రేమిస్తాననీ
నిన్నే ప్రేమిస్తాననీ
అసలు ఎప్పుడూ అనుకోలేదు..!!
నిన్నే ప్రేమిస్తాననీ నిన్నా మొన్నా
కూడా అసలు అనుకోలేదు.!!
నేను నీ అందానికి దాసోహమంటాననీ..!
నేడు.. నీ ప్రేమలో పడతానని...!!
అనుకుంటే జరుగుతాయా అన్నీ...!!
అనుకోకపోతే ఆగిపోతాయా కొన్ని..!!
నిజంగా నిన్ను కలిసాకే తెలుసుకున్నాను...
నేను నిన్ను ప్రేమిస్తున్నాననీ..!!
కలగానే ఉంది కనులెదుట స్వర్గంలా..!!
కలివిడిగా నవ్వుతూ నువ్వు కనిపిస్తోంటే..!!
స్వర్గధామంలా ఆనందపు ఆలోచనలు నా సొంతమైపోతుంటే...!!
జీవితమిలా ఆనందమౌతుందనీ అనుకోలేదసలు..!!
అసలు ప్రేమ మీద ఆలోచనలే లేవసలు నిన్ను చూసేవరకూ..!!
అందం అందమైన మనసున్న అమ్మాయి నన్నే ప్రేమిస్తుందని...!!
నేనంటే ప్రాణమిస్తుందనీ.. అనుకోలేదేనాడూ..!!

