STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

నిండు చందమామ

నిండు చందమామ

1 min
407

నింగి చందమామా తొంగి చూసే తొందరే చేసి

పొంగి అందమే పొటమరించే ముందరేచూసి

నింగి చందమామా తొంగి చూసే తొందరే చేసి

పొంగి అందమే పొటమరించే ముందరేచూసి

చీకటే చిరుదరహాసమై చిరునామాగా నిలిచే

కూకటి ప్రేమకు ఆ కూరిమే చేర్చుకొని కొలిచే

కోరికే కొరివిలా తొలిచేస్తుందే తొందరా చేసేసి

ఊరికే ఉండక ఉల్లం ఊరించే ఉల్లంఘించేసి

నింగి చందమామా తొంగి చూసే తొందరే చేసి

పొంగి అందమే పొటమరించే ముందరేచూసి


ఎక్కడో సాగే మబ్బులు వెన్నెలతో కలిసెనులే

ఇక్కడే రేగిన వలపులు కారణమై వెలిసెనులే

తనువుకిక తమకమేలే తరుణంలో తలపులో

ధనువుకిక దర్పమేలే గురి తప్పని గెలుపులో

నింగి చందమామా తొంగి చూసే తొందరే చేసి

పొంగి అందమే పొటమరించే ముందరేచూసి

చీకటే చిరుదరహాసమై చిరునామాగా నిలిచే

కూకటి ప్రేమకు ఆ కూరిమే చేర్చుకొని కొలిచే


కారణమేముండదు మనసులు కలిపేయను

రణమే నిండుగా మదిలో అలా నిలిపేయను

చెప్పుకొని ఊసులన్నీ చెరిసగం ఒక్కటవును

వప్పుకొని ఆ వగలన్నీ వలపించి దగ్గరవును

కోరికే కొరివిలా తొలిచేస్తుందే తొందరా చేసేసి

ఊరికే ఉండక ఉల్లం ఊరించే ఉల్లంఘించేసి

నింగి చందమామా తొంగి చూసే తొందరే చేసి

పొంగి అందమే పొటమరించే ముందరేచూసి



Rate this content
Log in

Similar telugu poem from Romance