STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

3  

Midhun babu

Classics Fantasy Inspirational

నిజము

నిజము

1 min
5


మనసుగాక ప్రేమనదే..లేదన్నది నిజము..!

నీవు తోడులేక బ్రతుకు..బరువన్నది నిజము..!


గుండెకైన గాయమేదొ..మానలేదు చూడు.. 

నీ తియ్యని చెలిమినీడ..సుఖమన్నది నిజము..!


కష్టానికి నన్నేలగ..మక్కువైన దిపుడు.. 

విరహానికి ఎగతాళే..మధువన్నది నిజము..! 


కలతకెంత ఉత్సాహమొ..కనుల ధార త్రావ.. 

తీరంలా ఈ చెక్కిలి..తీరన్నది నిజము..! 


ఆవేదన లోగిలిలో..సిగ్గుపడే సిగ్గు.. 

తలపుతలుపు వాకిలిలో..ముగ్గన్నది నిజము..! 



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics