STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీతో స్నేహం

నీతో స్నేహం

1 min
267

ఎడారిలో ఒయాసిస్సు..ఎడబాయని నీ స్నేహం..!

అగ్గిపూల వాననైన..చెయి వీడని నీ స్నేహం..!


నా ఊహలు పండించే..ముచ్చటలో..ధ్యానంలో..

పరిమళించు వెన్నెలలా..కడు చల్లని నీ స్నేహం..!


చిరునవ్వుల సోయగమై..ఎద నేలే మౌనంలో..

కనుపాపల కదలికలా..మరి మాయని నీ స్నేహం..!


అనురాగపు వరవీణకు..తంత్రులలో..స్వరములలో..

సరసరాగ వీచికలా..బహు కమ్మని నీ స్నేహం..!


ముద్దుపూల ముగ్గులతో..అలరించే లోగిలిలో..

నవమోహన రాగంలా..వసివాడని నీ స్నేహం..!


మరువలేని మరపురాని..వేడుకలే మగువా..

అక్షరాల గమఖంతో..తగు వెచ్చని నీ స్నేహం..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance