STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

నీలి కళ్ళ వాలు చూపులు

నీలి కళ్ళ వాలు చూపులు

1 min
324

నీలి కళ్శ వాలు చూపులు గుండెలోన గులాబీలు పండించవా

సోలిపోయే మనసులో సొగసులన్నీ ఒక్కసారిగా

నిండించవా

నిదురురాని రాత్రులన్నీ నీకే ఇక అంకితం చేసుకోనా

ఎదురులేని ప్రేమకి ఎడద సైతమే సమర్పుంచుకోనా

నీలికళ్శ చూపులే గుండెలోన గులాబీలే పండించవా

సోలిపోయే ఆ సొగసులన్నీ ఒక్కసారిగ నిండించవా

వంటరి పయనం వళ్ళంతా ఆ వలపు సెగలు రేపినే

తుంటరివైనం తుళ్ళింతా కలిపేసి వగలన్నీ చూపినే

తరుణమే తరమగా తనువులో ధనువులే తొలచెనే

కారణమే తెలిసిన వయసుకు కాంక్షలన్నీ మొలిచినే

నిదురురాని రాత్రులన్నీ నీకే ఇక అంకితం చేసుకోనా

ఎదురులేని ప్రేమకి ఎడద సైతమే సమర్పుంచుకోనా

నీలికళ్శ చూపులే గుండెలోన గులాబీలే పండించవా

సోలిపోయే ఆ సొగసులన్నీ ఒక్కసారిగ నిండించవా

తీగలా అల్లనీ స్థిరమైన ప్రేమని తిథులేమి చూడకా

త్యాగాలా నావలో రాగాలాపన చేసి ఎంతో వేడుకా

ఏరికోరి ఎదలోనా ఎంచుకొని ఎలమిలో తీపినంతా

చేరి మరి చెంతను చేసేయి తలపులన్నీ ఓపినంతా

నీలి కళ్శ వాలు చూపులు గుండెలోన గులాబీలు పండించవా

సోలిపోయే మనసులో సొగసులన్నీ ఒక్కసారిగా

నిండించవా

నీలి కళ్ళ వాలు చూపులు...

నీలి కళ్ళ వాలు చూపులు...

రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance