STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

3  

Ramesh Babu Kommineni

Romance

నీలాంటి....

నీలాంటి....

1 min
194

నీలాంటి అందగత్తెనే చూసాక నిలిచేదెలా

ఎలాంటి మోహం ఎదనే చేరక ఆపేసేదెలా

కళ్ళంతా కాంతి వలయాలు చేరి కట్టేసెను

ఒళ్ళంతా తుళ్ళింతలై వలపేమో పట్టేసెను

నీలాంటి అందగత్తెనే చూసాక నిలిచేదెలా

ఎలాంటి మోహం ఎదనే చేరక ఆపేసేదెలా


కదిలించి రేపొద్దూ కనపడని కలహాగ్నులు

విదిలించి పోవద్దు విన్నపాల విరహాగ్నులు

గుర్తుండిపోదా గుండెల్లోనే నిండిన వలపు

వస్తుండిపోవా నిలిపి ఉంచనూ ఆ గెలపు

ఈడుజోడు కలిసి విరిజల్లుల్లై వికసించునే

తోడునీడ ఆ తొలకరి జల్లుల్లై ఆకర్షించునే

నీలాంటి అందగత్తెనే చూసాక నిలిచేదెలా

ఎలాంటి మోహం ఎదనే చేరక ఆపేసేదెలా


పురివిప్పిన ఓ మయూరమా పులకించిపోవా

గురితప్పిన గుండెలయ మరి ఆలకించిపోవా

పురివిప్పిన ఓ మయూరమా పులకించిపోవా

గురితప్పిన గుండెలయ మరి ఆలకించిపోవా

నీలాంటి అందగత్తెనే చూసాక నిలిచేదెలా

ఎలాంటి మోహం ఎదనే చేరక ఆపేసేదెలా

కళ్ళంతా కాంతి వలయాలు చేరి కట్టేసెను

ఒళ్ళంతా తుళ్ళింతలై వలపేమో పట్టేసెను



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance