STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

నీడకేమి తెలుసు

నీడకేమి తెలుసు

1 min
223

నీడకేమి తెలుసులే నీలో దాగి ఉన్న కాంక్షలు

జాడలేని జాబిలివచ్చి తీర్చునా ఆ వాంచలు

కలగన్నాక మనసులో ఒకటే కలవరింతలేగా

కనుగొన్నాక చెలిని వలపుల పలవరింతలేగా

పగలు రేయికి తేడాలేని కాలం కదిలివచ్చునే

సెగలు రేగే వయసే సెలయేరై వరవడినిచ్చునే

నీడకేమి తెలుసులే నీలో దాగి ఉన్న కాంక్షలు

జాడలేని జాబిలివచ్చి తీర్చునా ఆ వాంచలు


నిదురరాని నిశీధులకు నివాళి అర్పించేసెయి

ఎదురులేని సన్మోహనానికి సన్మానం చేసెయి

కదిలి వచ్చే కబురులు కాంచనాలై వర్థిల్లునూ

కథలు చెప్పే ప్రావీణ్యము కళలై ప్రవర్థిల్లునూ

పగలు రేయికి తేడాలేని కాలం కదిలివచ్చునే

సెగలు రేగే వయసే సెలయేరై వరవడినిచ్చునే

నీడకేమి తెలుసులే నీలో దాగి ఉన్న కాంక్షలు

జాడలేని జాబిలివచ్చి తీర్చునా ఆ వాంచలు


కలిసిపోయె తరుణం ఆ రుణమే తీర్చునులే

అలసిపోని ఆంతర్యమే అంకితం చేర్చునులే

గుప్పెడు గుండెచేయ గురితప్పని సవ్వడులే

అప్పుడు కొంటెతనాలా కోరికలనే ఉరవడులే

కోరి వచ్చిన కొసరులు కొత్త రుచులే నేర్ఛుగా

చేరి చెలిమి చెరిసగమై మత్తులో ఏమార్చుగా

నీడకేమి తెలుసులే నీలో దాగి ఉన్న కాంక్షలు

జాడలేని జాబిలివచ్చి తీర్చునా ఆ వాంచలు

కలగన్నాక మనసులో ఒకటే కలవరింతలేగా

కనుగొన్నాక చెలిని వలపుల పలవరింతలేగా



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance