STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ ఊహల మధుమే

నీ ఊహల మధుమే

1 min
250

నీ ఊహల మధువేమో..దాచలేను ఎలాగిపుడు..!

ప్రేమగొడవ లేఖలలో..వ్రాయలేను ఎలాగిపుడు..!


నీకేంలే మౌనంగా భలే..హాయిగా ఉందువు..

తొందరపడు ఈ మనసును..నిలుపలేను ఎలాగిపుడు..!


ఉపాయంగ నువ్వైతే..ఊరిస్తూ ఉంటావే..

కలవరపడు ఈ వలపులు..కాచలేను ఎలాగిపుడు..!


చిలిపితనపు చిరునామా..దాచినావు నీ నవ్వుల..

అడ్డమైన విరహాలను..ఓపలేను ఎలాగిపుడు..!


స్నేహగంధ మంటేనే..మనబంధం ఎవరికెఱుక..

అల్లరింటి తాపాలను..చూపలేను ఎలాగిపుడు..!


Rate this content
Log in

Similar telugu poem from Romance