నీ శాపం
నీ శాపం
గాజుల బేరం భోజనానికి సరి
ఎందుకో అమ్మ అంటూ ఉండేది.
గాజుల బేరం భోజనానికి సరి అని
డజను గాజులు బేడనుండి
డజను నలభై అమ్మినా
అదే పాట
అదే వరస
గునుకుల నరసయ్య అమ్మినా
ఋషి వరుడు
కైవరపు నారాయణ స్వామి అమ్మినా
అప్పులోళ్ళే
పెళ్ళాం బిడ్డల ముందర చేతగాని వాళ్లే.
నోటిలో వేదాలు
చేతిలో తాయత్తు లు
తాత్వాలు బోధించినా
గంజినీళ్లు లేని బ్రతుకు గాజులోళ్లదే.
పుట్టుక కైలాసం
పార్వతమ్మ ముద్దుల బిడ్డని
గాజుల శెట్టిని
కాని బ్రతుకు ఓటీ గాజుల మోతలే.
తరాల తలరాత లో
దశ దిశ మారని జీవితాలు
మావే మావే ఎందుకు అయ్యాయి?
దేవతలు
అమ్మోరు వాళ్ళు
నామాలరాం ఫై ఎగబడి
గాజులేసుకొని
ముచ్చట పడ్డ మీరు
నన్నెందుకు కనికరించలేదమ్మ?
కొండ మీద దేవర
గుత్తంగా గాజులేసుకొని
బువ్వ పెట్టిన అమ్మా
నన్నెందుకు వజ్ర వైడూర్యాలు తీసుకొలేదని శాపించావు?
నీ శాపం
తరాల శాపమై
ఉనికి లేని మలార మై
మాఇంటి చారిత్రిక స్తూపం అయి నిలిచి పోయినది.
గునుకుల మాలియాద్రి
