STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

సోదరా

సోదరా

1 min
3


సంతోషానికి సంరంభానికి పొంగిపోవద్దు సోదరా
కష్టమొచ్చినా నష్టమొచ్చినా కుంగిపోవద్దు సోదరా

గెలుపూ ఓటమి జీవితమందున సమభాగాలే కదామరి
ఓడిపోయినా పొగిలిపోయినా లొంగిపోవద్దు సోదరా

జీవితపోరులొ వెనుదిరిగావా వెన్నంటొస్తాయ్ కష్టాలు
కన్నీళ్లొచ్చిన కడగళ్లొచ్చిన కరిగిపోవద్దు సోదరా 

జీవితగమనం ఇడుముల కడలిలొ
పడవప్రయాణమే “చల్లా”
భీతిచెందినా కలతచెందినా బెదరిపోవద్దు సోదరా

భవబంధాలూ వద్దనుకున్నా వదలిపోలేవు చివరంట 
స్నేహబంధాలు ఆలిత్యాగాలు మరచిపోవద్దు సోదరా


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics