నిజదార
నిజదార
జ్ఞానశ్రీ శ్రీదేవి కందర్ప లాలసా
తైగుణ్య మాలతీ సౌందర్య రూపిణీ
సూర్యమూ చంద్రమూ నీవేను రాగిణీ
నింగిలో తారవూ నాయింతి నేలనా
దమయంతి నీవైన నలరాజు నేనౌదు
శకుంతల కోరినా దుష్యంతు నేనులే
అనార్కలి డెందమూ సలీమూ చందమూ
అనితరం అవిరళం అనంతము నాప్రేమ
పద్మమే నీమోము వర్ణించ శక్యమే
సంద్రాలు నయనాలు భావనలు మృగ్యమే
చిరునవ్వు సాధించు భువనాలు లభ్యమే
లాభించు తద్యమూ మృగతృష్ణ మోక్షమే
సింధూర ధారణం నాప్రాణ కేతనం
సిరిమల్లె సిగలోన నాజీవ రాజసం
మెడలోన హేమమే నేనున్న జ్ఞాపకం
మదిలోన మెదలాడ ఉప్పొంగు మానసం
కళ్ళతో సైగలా కవ్వించు అలివేణి
నవ్వుతూ పూశరము సంధించు విరిబోణి
మనసునే మర్దించు సోయగం తనదేను
విలాసము వీక్షించు వరదుడా నిజనేను
