తులసి
తులసి
అమ్మా తులసీ ఇవ్వుము నీదయ
నమ్మితి నామది పూజలు చేసితి
ఈయగ వరముల దైవము నీవన
నాయెడ చూపుము మనసున కరుణను
తల్లీ పవిత్ర కూడుము నన్నూ
కూరిమి నీమది శమమును దమమును
తితీక్ష ఉపరతి శ్రద్దా సమాధి
షట్సంపత్తి కలిగిన దాననే
చతుర్విధ పురుషార్థాల పొందితి
అరిషడ్వర్గాలు అణచినానుగ
అనంత లోకము యేలిక వీవే
అరయగ రావా అభయము నీయగ
సానుకూల శక్తినొసగు హరిప్రియా
ఈశాన్యము విలసిల్లే విష్ణు ప్రియా
మోక్షమిచ్చు మంజరివే మొక్కవీవు
మొక్కినేను నివేదనల నిచ్చుకొందు
దుష్టశక్తులా దునుమాడెదవూ
అష్టైశ్వర్యాలను వొసగెదవూ
ఆరోగ్య ప్రదాతా యనుకీర్తీ
నీదన నుతింప ననుగావ రావె
