నీ రూపమే...
నీ రూపమే...
తడవతడవకూ నీ తపనే
విసుగురాదు మరి నీ తలపే
అడుగడుగునా నీ రూపే
వీడిపోదు నిను నా వలపే
శ్వాసశ్వాసలో నీ పిలుపే
ఆగిపోవువరకూ నా ఉసురే....
చాన్నాళ్లకన్నావు
నన్ను చూడాలనుందని ఎప్పుడన్నావు
గొంతు వినాలనుందని కొన్నాళ్ళకి అంటావు
నేనెవరని చివరికి చెప్తావు
నన్నెక్కడో చూసినట్టుందని.....

