నీ రాకకై
నీ రాకకై
గాలి కదలాడినా నీ రాకే అనుకుంటున్నా
కొమ్మ సడి చేసినా నీ ఊసే వింటున్నా
ఎండ నను తాకినా నీస్పర్శే అనుభూతి చెందుతున్నా
వెన్నెల విరబూసినా నీ వెలుగే చూస్తున్నా
రెప్ప మూసినా తెరిచినా నీ కలలే కంటున్నా
గుమ్మంలో ముగ్గై నీకోసమే వేచున్నా సిరి...
..

