STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ రాకకై నేను...

నీ రాకకై నేను...

1 min
239

నీ మనసుకు నచ్చిన నేను...

మధు మాసపు మరుమల్లియనే అవుతున్న...

నీ మురిపాలతో...

ముద్ద మందార వర్ణంలో ముగ్ధనే అవుతున్న...

నీ స్పర్శా పారవశ్యంలో...

విరిసిన పారిజాతమే అవుతున్న...

నీ బాహువులలో...

ముద్దబంతిలా బందీని అవుతున్న...

నీ కంటి లాలనలో...

సందె వేళ కలువనై విరబూస్తున్న...

గోధూళి వేళలో...

నీ మరుల పరిమళాలు..విరజాజులై నను తాకు వేళ...

వాసంత వనంలో వనజాక్షినై...

నీ రాకకై నేనెదురు చూస్తున్న..

                                -✍️ . సిరి 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance