నీ రాక కోసం ❣️❣️
నీ రాక కోసం ❣️❣️
నునునిగ్గుల ఆ బుగ్గలలో సింధూరపూలు పూసెనెందుకో........
కనురెప్పలు మోయలేని నీతలపుల బరువుతో వాలిపోయెనెందుకో......
అరచేతపండిన గోరింట ఇంకా ఎరుపెక్కెనెందుకో......
చేతిగాజుల గలగలలు సరిగమల్లా వినిపించెనెందుకో.......
కాలిమువ్వల సవ్వడికి గుండెలో అలజడి రేగినదెందుకో.......
ఎదురుచూపుల వాకిళ్ళలో
తలుపు తెరిచిన ప్రేమ నీకోసం చూసింది.......
నీరాక కోసం వేచింది.....

