STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ ప్రేమ రాగాలు

నీ ప్రేమ రాగాలు

1 min
215

సరసాల రాగాల..వీక్షణై పోతాను..! 

తనచెలిమి గీతాల..వెన్నెలై పోతాను..! 


ఒకప్రేమ పడవలో..పయనమే జీవితం..

మధుశాల పరువాల..రక్షణై పోతాను..! 


ఏ పూల తోటలో..విహరింతువో ఏమొ..

నీ ప్రేమ రాగాల..ఊయలై పోతాను..!


అ'మీది ఐ' తోటి..కాఫియా కావాలి..

షేరులో నేనింక..తియ్యనై పోతాను..!


మాటలే కరువైతె..సాక్షిలా నీవుండు..

నేనైతె గజలింటి..సాధనై పోతాను..!


ఓర్పనే ఓడలో..చోటుంది చేరవా..

నీ గుండె చాటుగా.. వేదనై పోతాను..!


గజలుతో యుద్ధమా..నేస్తమా ఊరుకో..

మంచినే పలికినా..వాదనై పోతాను..!


ప్రేమించు సంగతే..వింతగా ఉన్నదే..

నీ ఎదుట నే చెలిమి..కోవెలై పోతాను..!


మాటలే దండగా..గుచ్చగా తేలికే..

గజలులో కూర్చగా..శోధనై పోతాను..!


దిక్కులకు దిక్కుగా..ఉన్నదే తల్లిరో..

మనసు చూడరో..నీరదై పోతాను..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance