STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ ప్రేమ మాధుర్యం

నీ ప్రేమ మాధుర్యం

1 min
4

చిరునామనే ఇవ్వలేదు..కన్నులెత్తి నిన్ను చూడలేదు..! 


మనస్సునెలా దోచినావొ..నీ సంగతి తెలియలేదు..!

మాయ ఎలా ఉంటుందో..మాటలలో చెప్పుటెలా.. 

నీలోకమె నాలోకం..తలపురెప్ప వాలలేదు..! 


స్వర్గమెలా ఉంటుందో..నాకెందుకు నీవులేక.. 

నవమల్లెల వనమైనా..సౌఖ్యమింత అందలేదు..! 


 నీ స్పర్శ సుగంధ పరిహసించుచున్నయి.. 

ఇంతకన్న శాపమేదొ..తాపమసలు తగ్గలేదు..! 


సమయానికి దోబూచులు..ఆడటమే ఇష్టమేమొ.. 

ఈవిరహపు వెన్నెలేమొ..వేదించుట మానలేదు..!


ఏది దాచిపెట్టలేని..ముత్యాలే నాచుట్టూ.. 

వర్ణించగ సరితూగే..భాషన్నది దొరకలేదు..! 


నీ మనస్సు గళమెప్పుడు..పొంగేనో .. 

నీ ప్రేమ మాధుర్యం...  


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance