STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ ప్రేమ కోసం ♥️♥️

నీ ప్రేమ కోసం ♥️♥️

1 min
212


నీకోసం నా గుండె ప్రేమ పోగుల గూడు కట్టుకుని

నువ్వు రావటం కోసం ఎదురుచూస్తూ ..

నీ రాక కోసం స్వాగతం పలుకుతుంది

నీ కోసం మూగగా లో లో రోదిస్తుంది

నీ కోసం ప్రతి క్షణం యుగాలు కదిలిపోయినట్టు గా మారినట్టు గా

ప్రతి క్షణం నీతో నేను ముచ్చటించినట్టుగా నువ్వేమో నన్ను కోరినట్టుగా

కథలు కథలు నీకోసమే రాస్తూ అల్లరి చేసినట్టుగానీ గుండెపోగుల గూడు లో.. 

నా ప్రేమ గుండెను పదిలంగా భద్రంగా దోచుకున్నట్టుగా

నా నయనాలు రోజు కొత్త ప్రపంచం చూస్తూ

నా అను కొత్త స్వప్న ప్రపంచమే తలపిస్తూ

నువ్వు నేను ప్రేమ నీతో నా ప్రేమ పరుగులు మన ప్రేమ విజయమే అని కాంక్షిస్తూ

కల సమయం వల లో .. రోజు తెల్లారిపోతుంది.

పున్నమి వెన్నెల రాత్రులలో రంగుల ప్రపంచం రోజులా తలపిస్తూ ఉంటే..!

నా కనులు తెల్లారగానే నీ ప్రేమ కోసం అమావాస్య చీకట్లను దరికి చేర్చుకుంటున్నాయి..

నీ ప్రేమ తలపులలో ఊసుల లో ఇక బందించకు‌నువ్వు నా దారికి వచ్చి

నీ ప్రేమ తాళంచెవితో నా ఈ బాధ పంజరమును నుండి

నన్ను విడుదల చేస్తావు కదు .. 

ఎదురు చూసే నీ ముద్దుగుమ్మ నే నీ నేను...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance