Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Eevani Ravisankara Sarma

Romance

4.5  

Eevani Ravisankara Sarma

Romance

నీ పాదాలమీది ..!

నీ పాదాలమీది ..!

1 min
464


నను ప్రేమించానను మాట

ఈరోజైనా చెప్పైవా ,

జన్మజన్మలకూ నిన్నే తలుస్తూ బ్రతికేస్తా !


ఆ చూపులు చిలికే చల్లనివెన్నెల ,

పెదవులు పలికే జున్నులా .

మన మనసులు కలిసేందుకు కావాలేమిక ?

చెప్పైవా అందుకే

ప్రేమిస్తున్నానని ఆలస్యం ఏమాత్రం చేయక !


నేనెపుడో పంపా నా లేఖ .

ఆతృతగా చూస్తున్నా జవాబే రాక !

పువ్వులు పూసేను

పరిమళాన్ని పంచి ఉల్లాసపరచాలని ,

జాబిలి వచ్చేను

ప్రేమికులు కలసి విహరించాలని !


ఎన్ని పున్నములు విరిసినా ,

లెక్కకు మిక్కిలి పక్షులు

ఆకాశాన్ని అందంగా అలంకరించినా ,

నీ ప్రేమ ఓ రూపును దాల్చకున్నదే ,

ఉప్పొంగి నన్ను ముంచకున్నదే !?


నీ ముంగురులు నేనై చూపులను అడగనా ?

పాదాలమీది అందేలనే అయి సవ్వడి చేయనా !?



Rate this content
Log in

Similar telugu poem from Romance