నీ మౌనం...
నీ మౌనం...
క్షణక్షణం పరీక్షలే నిమిషనిమిషం నిరీక్షణే...
గంటగంటకో గండమేఘడియఘడియకో ఘర్షణే...
రోజురోజూ రాద్ధాంతమే వారాంతాలు వాడికత్తులే...
నెలలతరబడి నరకయాతనే ఏటికేడాది ఎడారిఎండమావే...
ఏనాటికి విడుదల తీరేనా నే కన్నకల...
నా ఊపిరికి నీ శ్వాససుమగంధాలు నా కనులకు సిగ్గులమైమరపులు
నా చెక్కిళ్ళకు ఎర్రనివర్ణాలు నా పెదవులకు మౌనరాగాలు
నా గుండెకు పెరిగెను వేగాలు నా గాజులు పలికెను సంగీతాలు
నా మేనికి జాజుల పరిమళాలు నువు హత్తుకున్న వేళ నాలో
ఎన్ని కలవరాలు వెన్నెల తాకని రేయిలా గుండెను కోయకిలా
తీరం చేరని అలలా ఆశలు రేపకిలా కాలం చెరపని వ్యధలా
మంటలు ఆరుటెలా మౌనమే మంత్రమిలా నీ పేరు జపిస్తున్నానిలా....
... సిరి ✍️

