మకరందం
మకరందం


ప||
ఎపుడో చూసాను మది దోచినా మకరందం
ఎక్కడో విన్నాను ఆ నచ్చినా గానసుగంధం |2|
చ||
కలకాలమీ హాయి మనలో మరులూ పెంచే
చెలి జ్ఞాపకాల చెరగనీ ముద్ర మదిలోఉంచే |2|
కలువ కన్నులతో కలిపెలే ఆ వన్నెల వెన్నెల
చిలిపి చూపు చిత్తం మరచి చూడకే నన్నల
|ప|
చ||
కొంతకాలమాగిన కొత్తదనం మనకే సొంతం
ఎంత ప్రేమ ఉన్నా పండదులే లేక ఏకాంతం |2|
కలలో సైతం కనిపించే ఆకనులలో మోహం
కౌగిలితో ఇకనైనా తీరేనా తీరికేలేని దాహం
|ప|
చ||
బంగారానికి విలువతగ్గునా గడిచినా కాలం
పొంగారని అందానికి ఆ పొందికేగ మూలం |2|
చిన్ని ఆశలూ చిలువలూ పలువలై పెరగనీ
కొన్ని రోజులు ఆ కోరికలే గుండెలో మరగనీ
|ప|