ఎందుకింత ప్రేమ
ఎందుకింత ప్రేమ


ఎందుకింత ప్రేమ
అవును
నువ్వు ప్రతి సారీ అడిగావు ఈ మాట
ఎందుకింత ప్రేమ
అదెలా చెప్పగలను
నన్ను నీలా ఎవ్వరూ నవ్వించలేదు
అందుకని చెప్పనా
నాకోసం ఎవ్వరూ ఎప్పుడూ గొడవపడలేదు
నువ్వు తప్ప
అందుకని చెప్పనా
ఈ రోజు నువ్వు నా దగ్గర లేవు
ఎప్పటికైనా నా కోసం వస్తావో లేదో తెలియదు
కానీ నన్ను నేను ద్వేషించుకునే స్థితి నుండి
నన్ను నేను ప్రేమించుకునే స్థాయికి ఎదిగేలా చేశావు
నీ కౌగిలిలో నా బాధలు మరిచిపోయేలా చేశావు
మన ప్రేమ సఫలమో విఫలమో
కానీ నా చిరునవ్వుల నిండా నీ ప్రేమ ఇచ్చిన స్పూర్తి నింపి వెళ్లావు
నీ ప్రశ్నకు సమాధానం నా ప్రేమ
నన్ను నేను ప్రేమించుకునేలా చేసిన నీ ప్రేమ