నీ హసం
నీ హసం
మోడు చివురు తొడిగేనని..తెల్పుతోంది నీ హాసం..!
మెఱుపు పరిమళించినట్లు..పాడుతోంది నీ హాసం..!
చెదరని నా కలలతోట..నర్తించే నెఱజాణా..
ఒకవెన్నెల వలలాగా..మారుతోంది నీ హాసం..!
వీనులలో మారుమ్రోగు..జ్ఞాపకాల రేరాణీ..
విరహాగ్నికి ఆజ్యమింత..ఒంపుతోంది నీ హాసం..!
నీలిమేఘ మాలలతో..ఆటలాడు మోహినివో..
చెలిమినదికి కొత్తపరుగు..నేర్పుతోంది నీ హాసం..!
ప్రేమపవన ముంటుందని..అందలేదు నా ఊహకు..
నిత్య కలిమినిధికి దారి..చూపుతోంది నీ హాసం..!

