నీ గజలుకు
నీ గజలుకు
వేమనయే దిగివస్తే..మొక్కాలోయ్ నీ గజలుకు..!
అన్నమయ్య మరి పుడితే..ఆడాలోయ్ నీ గజలుకు..!
కాళిదాసు భీమకవులు..కరములు జోడించేరా..
శహభాషని భుజముపైన..తట్టాలోయ్ నీ గజలుకు..!
నన్నయ తిక్కనలైనా..అచ్చెరువొందాలంటా..
గాలిబ్ దాశరథి సినారె..మురవాలోయ్ నీ గజలుకు..!
జగజీత్ సింగ్ పంకజ్ ఉదాసాదులు చూడూ..
పరవశాల మధుశాలన..చేరాలోయ్ నీ గజలుకు..!
తెలుగులోన గజలేమిటి..అన్నవారు మహనీయులు..
అవాక్కవౌతు చిరునవ్వై..మిగలాలోయ్ నీ గజలుకు..!
