STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ చూపుల హరివిల్లు

నీ చూపుల హరివిల్లు

1 min
272


నీ నవ్వుల హరివిల్లే..వేటాడుతు ఉన్నది..!

నా తియ్యని ఆరాధన..కథ నడుపుతు ఉన్నది..!


నీకోసం ఎదురుచూపు..హాయేనని అంటా..

పూలగాలి పరిహాసము..చెవినిపడుతు ఉన్నది..!


నీ తలపుల పొదరింటికి..తాళమెలా వేయను..

గగనమంత నీ మౌనం..నన్నేలుతు ఉన్నది..!


నీ చూపుల మధువునిలా..ఒంపమందు కొంచెం..

ఈ చీకటి చెలిమిమీర..తల నిమురుతు ఉన్నది..!


సమాధిలో ఉన్నానని..చెప్పలేను వినవా..

చూపలేని రుతురాగం..చేజారుతు ఉన్నది..!


చితిమంటల ఎదురొస్తే..నవ్వకుండ ఎట్లా..

బ్రతుకుతీపి వెన్నుపోటు..వెంటాడుతు ఉన్నది..


Rate this content
Log in

Similar telugu poem from Romance