నీ చెలిమి
నీ చెలిమి
తొలి పొద్దుపొడుపు తూరుపు నీవు
తొలి రవికిరణపు తాకిడి నీవు
తొలకరిలో చినుకే నీవు
తొలిగా నాలో పొంగే రాగం నీవు
తొలితొలి నా కవితే నీవు
నాలో వెలుతురే నీవు....
నీ కోసం కలవరింత
నీ పిలుపు వింటే పులకరింత
నీ కబురందితే కేరింత
నీరూపు కంటే మదిలో గిలిగింత
నీ ఒడినిచేరు వరమివ్వు ఇసుమంత...
నీ చెలిమి కోరిచేయు తపము కొండంత...
.. సిరి ✍️❤️

