నిదురయే
నిదురయే
చెప్పకనే దరిజేరు..చల్లనిది నిదురయే..!
కలలలో తేలించు..తియ్యనిది నిదురయే..!
దేవతై కరుణించు..తన ఒడిని లాలించు..
అమృతశక్తిని నింపు..కమ్మనిది నిదురయే..!
బాధలను తొలగించు..ఓషధీ లతతాను..
వ్యాధులను తగ్గించు..వెచ్చనిది నిదురయే..!
అలసటకు మధువులా..అందేను తలచకే..
అమ్మలా లాలించు..చక్కనిది నిదురయే..!
మౌనమున ముంచెత్తు..వేదాంత గ్రంథమే..
తనువెల్ల ఏలుతూ..చిక్కనిది నిదురయే..!
ఆకాశ వీధుల్లొ..విహరింప జేయునే..
ఆక్రమణ చేయగా..ఆగనిది నిదురయే..!
