STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

నిదురించని..

నిదురించని..

1 min
338

నిదురించని నా మనసులోనికి అనుకోకుండ

కదిలించే భావమొకటి చేరింది తెలియకుండ

తొలివెలుగు ఉదయాన తెలి మంచు జాడలో

అలి కూజితమే విని ఆలాపన అంచు నీడలో

అంబరమే అందిన సంబరమే తనువణవున

ఆడంబరమే అలలుగాచేరెను అణవణువున

నిదురించని నా మనసులోనికి అనుకోకుండ

కదిలించే భావమొకటి చేరింది తెలియకుండ


పెరిగే విరహాన పెను గాలమే వేసే ఓ బంధమే

జరిగే క్రతువు ఆజన్మాంతరపూ అనుబంధమే

పరవశించే పకృతి ఆమనై దిగి వచ్చినట్లుంది

వికసించే నవ్వుతో ఆమెనే......చూసినట్లుంది

కనుల ముందరే కోరిన స్వప్నం సాక్షాత్కారమే

వీనుల చేరిన రాగం ఎద అంతకూ సత్కారమే

నిదురించని నా మనసులోనికి అనుకోకుండ

కదిలించే భావమొకటి చేరింది తెలియకుండ

తొలివెలుగు ఉదయాన తెలి మంచు జాడలో

అలి కూజితమే విని ఆలాపన అంచు నీడలో


కానరాని కాంక్షితమే అల్లెతాడులుగా అల్లగా

మానరాని మక్కువే మమతలన్నీ వెదచల్లగా

కానరాని కాంక్షితమే అల్లెతాడులుగా అల్లగా

మానరాని మక్కువే మమతలన్నీ వెదచల్లగా

అంబరమే అందిన సంబరమే తనువణవున

ఆడంబరమే అలలుగాచేరెను అణవణువున

నిదురించని నా మనసులోనికి అనుకోకుండ

కదిలించే భావమొకటి చేరింది తెలియకుండ



Rate this content
Log in

Similar telugu poem from Romance