Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

నిదురించే రేయి

నిదురించే రేయి

1 min
296


నిదురించే రేయిలో కదిలించినే హాయినే

అదిలించే మనసులో ఆమనే పూయునే

పూలవనం పురివిప్పి పూతలే పట్టెనులే

కాలగమనం కబురుచెప్పి లేపి తట్టెనులే

కలిగించే ఎదసౌఖ్యం ఎదనింపి నిండుగా

కలిసుంచే ఊసులు కలిసి చేసే పండుగా

నిదురించే రేయిలో కదిలించినే హాయినే

అదిలించే మనసులో ఆమనే పూయునే


ఎంత వింత లోకమో ఇంత ఊరించునే

అంతే చిత్రంగా ఈ ప్రేమలే చిగురించునే

కొత్త వలపు కోరికలెన్నో పెంపొందించునే

మత్తు కలిపి మదిమొత్తం ఆనందించునే

కొత్త వలపు కోరికలెన్నో పెంపొందించునే

మత్తు కలిపి మదిమొత్తం ఆనందించునే

నిదురించే రేయిలో కదిలించినే హాయినే

అదిలించే మనసులో ఆమనే పూయునే

పూల వనం పురివిప్పి పూతలే పట్టెనులే

కాల గమనం కబురుచెప్పి లేపి తట్టెనులే


చెప్పలేని సౌఖ్యం చెంతకే చేర్చేసిన ప్రేమ

గొప్పగానే చెప్పాలి అమరమైనదని ప్రేమ

లేలేత ఆ వలపు లేదనక ముకుళించునే

పైపూత వలదులే పక్వమై పరిమళించనే

కలిగించే ఎదసౌఖ్యం ఎదనింపి నిండుగా

కలిసుంచే ఊసులు కలిసి చేసే పండుగా

నిదురించే రేయిలో కదిలించినే హాయినే

అదిలించే మనసులో ఆమనే పూయునే



Rate this content
Log in

Similar telugu poem from Romance