నెలవంక
నెలవంక
బంగారు నెలవంక ఉడికించి వెళ్తుంది
విరహమను మధువునే వడ్డించి చూస్తుంది..
పగలునే రేయిలా నిలిపేసె నేలనో
చీకటను తోటలో మరిపించి వెళ్తుంది..
రావు ఇంకా ఆ ఘడియలు నీ భుజముపై వాలాలి
సందేహమే వచ్చి ఊరించి ఉంటుంది..
నిదురతో పనిలేని సమయమే తియ్యనా
ఒకతీపి మాయనే రగిలించిది
అరుణ రాగాలలో తేలించు నెప్పుడో
ఊహలో నీ చిత్రాన్ని చిత్రించ మదిలో...
నీ మౌనమే బాషా భావాలు గగనమై నేను
నందుకు లేకున్నా...
కుశలమేనా నీవు అచ్చటనో నా ప్రియ మాధవ
ఎదలోన నీ ప్రేమ దీపం వెలిగించవు...

