నేస్తం
నేస్తం
షడ్రుచుల సమ్మేళనం నీవనుకున్నాను
కఠీన హృదిగ దర్శనమిచ్చావు
తీపిరుచి తెలిసేలోపే
చేదు జ్ఞాపకమయ్యావు
పులుపుతలపు విడిచేలోపే
ఘాటుకలను కంటికందించావు
చిలిపివలపు వగరు చవిచూపించి
కన్నీటిరుచిని పెదవికి కానుకిచ్చావు...
నాఅల్లరి భరిస్తావు నాకోపం సహిస్తావు...
నాకోసం ద్రవిస్తావు నీలోకం నేనంటావు...
నీసర్వం ఇచ్చేస్తావు నేనే నువ్వని అంటావు...
నువ్వే లేకుంటేనేనంటూ ఏమైపోతానో...
నీకైనా తెలుసా నేస్తం...
.. సిరి ✍️❤️

