నేస్తమా...
నేస్తమా...
మనసులోని మాటలు మూగబోయినపుడు
ప్రేమ లేఖలు గుడ్డివి అవుతాయి ....!!
నమ్మకాలు అమ్మకాలు ఐనపుడు
మమతలు చెవిటివి అవుతాయి ....!!
హుషారు తుషార బిందువుగా లేనప్పుడు
ఆనంద భాష్పాలు కన్నీరు మున్నీరుగా మారుతాయి...
భావపు తోటలు మోడుబారినపుడు
అక్షరాలకు చెదలు పుట్టదా...??
