నేస్తమా...
నేస్తమా...
మబ్బులు పట్టిన ఆకాశం...........
గ్రహణం పట్టిన శశిబింబం............
దుఃఖం నిండిన నా హృదయం...........
కష్టం నిలిచినదీ సమయం..............
భారమై కన్నీటి పొర.............
దూరమయ్యేదెప్పుడో వేదన చెర............
కాలమునే బ్రతిమాలి నే కోరా.............
కరగమని పొగమంచు తెర..............
ఎదురీతల్లో ఎదకోత మిగిలేనా..............
విధిరాతల్లో చేతి గీతలు చెరిగేనా.............
ఈతి బాధలతో జీవితము సాగేనా..............
గ్రహణం వీడుతూ పున్నమి వెన్నెల కాసేనా............
కన్నీరై కరిగే కష్టం..............
భారం తీరగా తేలిక చిత్తం..............
దూరమవ్వక తప్పదు చెడుకాలం............
దరికి రాకుండదు సంతోషం...............
కాదు కదా ఏదీ శాశ్వతం...............
సుఖదుఃఖాలతో బ్రతికేయ్ నేస్తం.............

