STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నేను

నేను

1 min
212


అక్షరాల ఊయలలో.. పసిపాపను నేను..!

అమ్మతనం ధనమయ్యిన..ఒక పాటను నేను..!


నీకోసం ప్రేమనదిగ..ప్రవహించే సుధను..

పసిడిపూల తోటలోని..ఓ కొమ్మను నేను..!


నీ కోర్కెల మేఘాలను..మళ్ళింతును దారి.. 

సత్యమేదొ విందుచేయు..నీ శ్వాసను నేను..! 


తర్కానికి తావిచ్చే..గుణమేకద అడ్డు.. 

చెలిమినేల పొరలలోని..ఒక గింజను నేను..! 


నీ కమ్మని కలలపంట..అవుతూ నేనుందు.. 

వెన్నుతట్టి నడిపే..భగవద్గీతను నేను..! 


మరిమనసుకీ ప్రేమ..పంచుతూనె నిలతు.. 

నీ మనస్సు దాహార్తికి..ఒక చెలమను నేను..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance