నేనైతే చాలు
నేనైతే చాలు
నువు కోరే పూలతోట..నేనైతే చాలు..!
నా మనస్సు నీకై హరి..విల్లైతే చాలు..!
ఎంతహాయి గుంటుందో..నాతో నీవున్న..
ఊరించే పాలపిట్ట..తోడైతే చాలు..!
సిగ్గుపూల వాగులోకి..విసిరేసే వేల..
మౌనమనే పాత్రలోని..మధువైతే చాలు..!
ఏ బంగరు కోవెలలో..దేవతవో అసలు..
గుండెలయల దీపానికి..వెలుగైతే చాలు..!
మధురోహల వెన్నెలింటి..ఊయలవే నీవె..
తర్కానికి తావివ్వని..ముద్దైతే చాలు..!

