నేలపై పుష్పక విమానం
నేలపై పుష్పక విమానం


రైలు
గమ్యాన్ని దరిజేర్చే
ప్రయాణీకుల వసతిగృహం
నేలపై పరుగులుతీసే
సామాన్యుల పుష్పకవిమానం
కదులుతున్న ఇంటివరుసలు
పట్టాలెక్కిన అవసరాలు
పట్టాలెక్కితే రైలుపెట్టెలు
చుట్టాలతో..చెట్టపట్టాలు
డిగ్రీపట్టాకై ప్రయాణం
రైలుపెట్టెదే సహాయం
ఆగనిదమ్మా జీవనయానం
రైలేదైనా తప్పదు పయనం