STORYMIRROR

Midhun babu

Romance Inspirational Others

4  

Midhun babu

Romance Inspirational Others

నాకు నేను లేను నాలోనా

నాకు నేను లేను నాలోనా

1 min
385

నిలదీసే తత్వాన్ని నిద్రపుచ్చి

రాజీపడే తత్వాన్ని నరనరానికి ఎక్కించుకొన్నాక 

బాధ్యత కన్న భయమే దేహమంతా ఆవహించి 

చిన్ని గుండెలో తిష్టేసింది‌ ఆ ఉదయాన..!!

తప్పు చేయకున్నా తప్పించుకునే దారుల

వెతుకులాటలో వ్యక్తిత్వం దొడ్డిదారి లోకి దూరినాక

నవ్వులమ్మ మొగం చాటేసింది హృదయాంతరంగాన..!!

నిత్యం నీళ్ళు పోసి పెంచిన సహజత్వం పూలమొక్కలు

వాడిపోయి మొగ్గలుగానే రాలిపోతుంటే వికాసం 

కకావికలమైంది నడవడిక రాజమార్గాన.!!

నేరమొకడు చేసి శిక్షను తనకేసిన

నోరు మెదపని నైజానికి ఆలవాలమై ఆలనాపాలనా లో

అబద్రతా భావ  ఆనవాళ్లు అడుగడుగునా

మొలకెత్తి నిలకడ తత్వం కనుమరుగవుతు 

నిదుర కరువైంది కుదురు తనాన..!!

నన్ను నేను హింసించుకుంటు అనారోగ్యాన్ని 

ఆహ్వానించుకున్నాక మనశ్శాంతి ఎక్కడ మానసాన..!!

మనఃపూర్వక భావవ్యక్తీకరణ మౌనం వహించి 

భాషలో అసహనం  అపసృతులు తాండవిస్తు

మనసుకు బుద్ధి కి మద్య వైరుధ్యాల యుద్ధాలు

నిత్యం చేస్తూనే వున్నాక సత్యం ఎక్కడ నాలోన.!

చేతకాని తనమో చేవలేని తనమో కాని

ప్రశ్నించలేని అస్తిత్వాన్ని కోల్పోయాక

అస్తవ్యస్తంగా మారిన జీవనశైలిలో

స్థిరత్వం శిధిలమై అంతరంగమంతా

ప్రశ్నలే ప్రశ్నలు జవాబులు కరువై

జవాబు దారి తనాన్ని ఎడారి చేసిన

రాజీ ధోరణిలో నన్ను నేను కోల్పోయాక

జీవశ్చవంగా కనిపిస్తున్నాక నాకు నేనే లేను నాలోనా..



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance