నా కొంచెం ప్రేమ కావాలి
నా కొంచెం ప్రేమ కావాలి
బద్దలైన మనసు లో బాధను ఏరివేయడానికి.
కుమిలిపోతున్నా జీవితంలో కొత్త నీరు నింపి.
ఆలోచనలు పసిగట్టి నవ్వుల పువ్వులు పూయించడానికి.
ఒంటిగా ఉన్నా దండలో పువ్వుల దండ అల్లడానికి.
ఇంద్ర ధనస్సుల రంగులు నింపి
ఆప్యాయతలు పంచి.
నవ్వుల వర్షంలో తడిపేసి.
ప్రేమగా హక్కున చేర్చుకొని దూరాలను దూరం
చేసి దగ్గర చేయాలి.
నీలుపుకోవాలి కలకాలం ధైర్యంగా నిలబడి.
ఆ ప్రేమ తరంగాల రాగాలు మ్రోగించాలి.
ఉలిక్కిపడి లేచిన సమయంలో
ఆ ప్రేమ గుర్తుకొచ్చి వెయ్యి ఏనుగుల బలమివ్వాలి.
అసంపూర్ణమైన జీవితం పున్నమి వెలుగులు తేవాలి.
ఆ ప్రేమ గుర్తుకొచ్చిన ప్రతిసారి ఆనంద భాష్పాలతో
తడిసిపోవాలి అనునిత్యం ఆ ప్రేమలో...
