ప్రేమంటా
ప్రేమంటా
కనులభాష కన్నులతో..చదువునదే ప్రేమంటా..!
చెలి మదిలో పూలనదిగ..పొంగునదే ప్రేమంటా..!
ఇచ్చి పుచ్చుకునే పనిని..వ్యాపారం అంటారే..
తిరుగేమీ ఆశించక..ఉండునదే ప్రేమంటా..!
ప్రియురాళ్ళను కరిగించే..అగ్నిధార తానేలే..
కళ్యాణపు శోభలతో..వెలుగునదే ప్రేమంటా..!
మాటలెల్ల మూగబోగ..పరిమళించు మౌనమదే..
విశ్వమైత్రి వనసీమను..పెంచునదే ప్రేమంటా..!
ఒక కాఫీ కలిసి త్రాగు..ముచ్చటెంత భాగ్యములే..
ఇరు మనసులు ఒక్కటిగా..నిలుపునదే ప్రేమంటా..!
ఒకరికొఱకు ఒకరేమిటి..రెండంటూ ఉన్నవెచట..
సహనానికి సరిహద్దులు..చెరుపునదే ప్రేమంటా..!
