STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నా ప్రేయసివై

నా ప్రేయసివై

1 min
332


చిరు నవ్వుల కోవెలలో దేవతయే నా ప్రేయసి..!!

మరుమల్లెల తోటలలో పరిమళమే నా ప్రేయసి..!!


నా కలలను నిజం చేయ అనుక్షణం తపియించును..!!

నీలి మబ్బు తరగలలో సుమధనువే నా ప్రేయసి..!!


ఆమె కాలి మువ్వలలో సవ్వడిగా మారుటేల..!!

అక్షరాల వెన్నెలలో జాబిలియే నా ప్రేయసి..!!


ఏ సాగర తీరంలో దొరికేనా పద ముద్రలు..!?

అలవి కాని భావనలో వసంతమే నా ప్రేయసి..!!


విరహమసలు నా ఎదనే చేరనీదు కలనైనా..!!

కలహంసల వీధులలో కాంతి నదే నా ప్రేయసి..!!



Rate this content
Log in

Similar telugu poem from Romance